బ్రేకింగ్ : వైసీపీ నేత హత్య కేసులో కేఈ కొడుకుపై కేసు నమోదు

Update: 2017-12-27 12:37 GMT

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కుమారుడు శ్యాంబాబుపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. వైసీపీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో శ్యాంబాబునిందితుడిగా ఉన్నాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో నారాయణరెడ్డి భార్య శ్రీదేవి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈకేసులో శ్యాంబాబు పేరును తొలగించడంపై శ్రీదేవి డోన్ కోర్టును ఆశ్రయించారు. జనవరి 25వ తేదీ లోపు పూర్తి వివరాలను సమర్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఈమేరకు కేఈ శ్యాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News