వైసీపీ ఎంపీలు రాజీనామాలకు వైసీపీ నిర్ణయం తీసుకుంది. నెల్లూరు జిల్లా కలిగిరి సభలో ఆయన సంచలన ప్రకటన చేశారు. మార్చి 5వ తేదీ నుంచి ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో ఆందోళన చేయనున్నట్లు ప్రకటించారు. ఆలోగా పరిష్కారం కాకుంటే ఏప్రిల్ 6వ తేదీన వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం దిగి వచ్చే దాకా ఉద్యమిస్తామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఒక్కటే సంజీవిని అని తెలిపారు. అందుకోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధమని తెలిపారు. ఏప్రిల్ 6వ తేదీ వరకూ పార్లమెంటు సమావేశాలు జరగుతాయని అప్పటికీ ప్రభుత్వం దిగిరాకుంటే ఏప్రిల్ 6న రాజీనామాలు చేస్తామని జగన్ బహిరంగ సభలో ప్రకటించారు.