బ్రేకింగ్ : వాళ్లనే నమ్ముకున్న కేసీఆర్

Update: 2018-03-15 06:07 GMT

రైతులే లక్ష్యంగా తెలంగాణ బడ్జెట్ సాగింది. ఈ బడ్జెట్ లో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింది. రైతు పెట్టుబడి సాయానికి బడ్జెట్ లో పన్నెండు వేల కోట్ల రూపాయలను కేటాయించింది. రైతుపెట్టుబడి సాయం 2018-19 నుంచి ప్రారంభమవుతుందని ఆర్థిక మంత్రిఈటల రాజేందర్ తెలిపారు. ఎకరానికి రూ.8000 పెట్టుబడి సాయం ఈఏడాది నుంచే ప్రతి రైతుకు అందిస్తామని చెప్పారు. ఇందుకోసం రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయంలో దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన ఉండేందుకు కృషి చేస్తున్నామన్నారు. రైతుల కోసం రైతు బీమా పథకాన్ని ఏర్పాటు చేశామని, ప్రతి రైతుకు ఐదులక్షల బీమాను వర్తింప చేస్తామన్నారు ఈటల. వ్యవసాయ, మార్కెటింగ్ రంగాలకు 15,780 కోట్ల రూపాయలను కేటాయించింది. త్వరలో ధరణి వెబ్ సైట్ ను ఆవిష్కరిస్తామని చెప్పారు. రైతు బీమాకు బడ్జెట్ లో 500 కోట్లు కేటాయించారు. వ్యవసాయ యాంత్రికీకరణకు 522 కోట్లు కేటాయించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ రాష్ట్రంలో ఉన్న రైతులందరినీ ఆకట్టుకునేలా సాగింది. వ్యవసాయానికి కేటాయించిన బడ్జెట్ ను చూస్తుంటే ప్రధానంగా రైతులనే నమ్మకుని కేసీఆర్ ఎన్నికల గోదాలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.

Similar News