బ్రేకింగ్ : వన్ అండ్ ఓన్లీ...కేఈ...!

Update: 2017-12-29 06:02 GMT

కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమయింది. బరిలో ఉన్న అభ్యర్థులందరూ ఉపసంహరించుకున్నారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనుచరుడు నాగిరెడ్డి కూడా తన నామినేషన్ ను ఉపసంహరించుకోవడంతో కేఈ ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసిన తర్వాత నాగిరెడ్డి నామినేషన్ ను ఉపసంహరించుకోవడం విశేషం. బైరెడ్డి త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. 2013 లో టీడీపీ నుంచి బయటకు వచ్చి బైరెడ్డి అప్పటి నుంచి నిన్నటి వరకూ సీఎం చంద్రబాబును కలవలేదు. కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితంగానే ఆయనకు బాబు నుంచి పిలుపు వచ్చింది. దీంతో బైరెడ్డి, బాబు ల మధ్య చర్చలు సఫలమయ్యాయి. దీంతో నాగిరెడ్డి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో కేఈ ప్రభాకర్ కర్నూలు ఎమ్మెల్సీ స్థఆనిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయినట్లే. ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ పోటీ చేయలేదు.

Similar News