బ్రేకింగ్ : లోక్ సభ సోమవారానికి వాయిదా

Update: 2018-03-28 06:41 GMT

లోక్ సభ తిరిగి 12 గంటలకు ప్రారంభమయింది. సభ తిరిగి ప్రారంభమైన వెంటనే అన్నాడీఎంకే సభ్యుల నినాదాల మధ్యనే స్పీకర్ సభా కార్యక్రమాలను చేపట్టారు. అన్నాడీఎంకే సభ్యులు నినాదాలు చేస్తూనే ఉన్నారు. లోక్ సభలో గందరగోళం మధ్యనే ప్రభుత్వం కొన్ని బిల్లులను ప్రవేశ పెట్టింది. స్పీకర్ పోడియాన్ని చుట్టిముట్టిన అన్నాడీఎంకే సభ్యులు కావేరీ జలాల బోర్డును ఏర్పాటు చేయాల్సిందేనంటూ నినాదాలు చేశారు. నినాదాల మధ్యనే వివిధ నివేదికలను ప్రభుత్వం సభ ముందుంచింది. సభ్యులు సహకరించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ పదే పదే విజ్ఞప్తి చేశారు. ఎప్పటిలాగానే కేంద్రమంత్రి అనంతకుమార్ తాము అవిశ్వాసంపై చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అవిశ్వాసాన్ని తమ ప్రభుత్వం స్వాగతిస్తుందన్నారు. సభ ఆర్డర్లో ఉంచి చర్చ చేపట్టాలని ఆయన స్పీకర్ ను కోరారు. అవిశ్వాసం నోటీసులను స్పీకర్ సభకు చదివి విన్పించారు. సభ ఆర్డర్ లో లేకపోవడంతో తాను సభ్యులను లెక్కించలేక పోతున్నానన్నారు. దీంతో సభను స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు.

Similar News