బ్రేకింగ్ : లాలూ దోషి.. జైలుకే...

Update: 2017-12-23 10:24 GMT

దాణా కుంభకోణం కేజులో లాలూను రాంచీ కోర్టు దోషిగా నిర్ణయించింది. 1991 నంచి 1996 మధ్య కాలంలో దాణా కుంభకోణం వెలుగు చూసింది. 1997అక్టోబర్ 27 న ఈ కుంభకోణం కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. దేవ్ గడ్ ట్రజరీ నుంచి లాలూ 86 లక్షలు తీసుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో మరో నిందితుడైన మాజీ సీఎం జగన్నాధ మిశ్రాను నిర్దోషిగా ప్రకటించింది. తుది తీర్పు ప్రకటించడంతో లాలూ మళ్లీ జైలుకెళ్లక తప్పదు. దాణాకుంభకోణంలో మొత్తం 900 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు తేలింది. దీంతో రాంచీ జైలుకు లాలూను తరలించారు. అయితే రాంచీ సీబీఐ కోర్టు ఈకేసులో లాలూ ప్రసాద్ యాదవ్ జనవరి 3వ తేదీన శిక్షను ఖరారు చేయనుంది. జగన్నాధ్ మిశ్రాతో పాటు మరో ఏడుగురిని సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

Similar News