బ్రేకింగ్ : రేవంత్ కొత్త ట్విస్ట్ ఇచ్చారే?

Update: 2017-10-20 06:41 GMT

టీటీడీపీ రేవంత్ రెడ్డి కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరుగుతున్న టీటీడీపీ పొలిట్ బ్యూరో సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. రేవంత్ వ్యవహారంపైనే చర్చించేందుకు సమావేశం జరుగుతుండటం విశేషం. అయితే అనూహ్యంగా రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి హాజరయినట్లు తెలిసింది. రేవంత్ రెడ్డి పార్టీ మారుతున్నట్లు ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్ లోకి వెళుతున్నారన్న వార్తలు నేపథ్యంలో రేవంత్ ఏపీ మంత్రులపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈనేపథ్యంలో టీటీడీపీ పొలిట్ బ్యూరో సమావేశాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి రేవంత్ హాజరవ్వడం విశేషం. మరికాసేపట్లో రేవంత్ ఈ సమావేశంలో ఏం వెల్లడించనున్నారన్న విషయం తెలుస్తోంది.

Similar News