బ్రేకింగ్ : ఎమ్మెల్యే పదవికి రేవంత్ రాజీనామా

Update: 2017-10-28 10:49 GMT

టీడీపీ మాజీ నేత రేవంత్ రెడ్డి తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిసింది. ఈ నెల 27వ తేదీన స్పీకర్ కు రేవంత్ తన రాజీనామా లేఖను పంపినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న విషయం దాదాపు ఖరారైంది. అయితే కొద్దిసేపటి క్రితమే టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ లేఖను చంద్రబాబు పేషీలో ఇచ్చి రేవంత్ వెనుదిరిగారు. అయితే రేవంత్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈరోజు చంద్రబాబుతో సమావేశం ఉండగా నిన్ననే శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం, మరోవైపు వారిపై న్యాయపోరాటానికి దిగడంతో అదే తప్పు తాను చేయకూడదని రేవంత్ భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Similar News