తెలంగాణలో రాజ్యసభ ఎన్నికల్లో స్వతంత్ర సభ్యుడు దొంతి మాధవరెడ్డి ఓటు వివాదాస్పదమయింది. ఆయన కాంగ్రెస్ ఏజెంటుకు చూపించి ఓటు వేయడంతో రిటర్నింగ్ అధికారి కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. దొంతి మాధవరెడ్డి ఓటుపై టీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు విప్ ను ధిక్కరించారని కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు.