స్పీకర్ నిరవధికంగా సభను వాయిదా వేస్తామని హెచ్చరికలు జారీ చేయడంతో వైసీపీ పార్లమెంటు సభ్యులు తమ రాజీనామా పత్రాలను సిద్ధంచేసుకున్నారు. ప్రభుత్వం సభను నిరవధికంగా వాయిదా వేయాలని చూస్తుందన్న వార్తలు హస్తినలో హల్ చల్ చేస్తున్నాయి. సభ నిరవధికంగా వాయిదా పడిన వెంటనే రాజీనామా పత్రాలను స్పీకర్ ఫార్మాట్లో సుమిత్రా మహాజన్ వద్దకే వెళ్లి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. సభ నిరవధిక వాయిదా పడిన వెంటనే తమ ఎంపీలు రాజీనామా చేస్తారని వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామాలేఖలను సిద్ధం చేసుకున్నారు.