బ్రేకింగ్ : యడ్డీ ప్రమాణం .......ఒక్కరే...!

Update: 2018-05-17 04:03 GMT

కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్ యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. కొద్దిసేపటి క్రితం రాజభవన్ లో యడ్యూరప్ప చేత గవర్నర్ వాజూభాయి వాలా ప్రమాణ స్వీకారం చేయించారు. కర్ణాటక రాష్ట్రానికి యడ్యూరప్ప 23వ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే యడ్యూరప్ప బలనిరూపణను పదిహేను రోజుల్లో చేసుకోవాల్సి ఉంది. బలనిరూపణ తర్వాతనే మంత్రివర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించాలని నిర్ణయించారు. అందరూ అనుకున్నట్లుగానే, తాను చెప్పినట్లుగానే యడ్డీ కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు. గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా జేడీఎస్, కాంగ్రెెస్ లు ఆందోళనలు చేయాలని నిర్ణయించాయి.

Similar News