ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ మెట్రో రైల్ ను ప్రారంభించారు. సరిగ్గా 2.15 నిమిషాలకు మియాపూర్ మెట్రో స్టేషన్ లో నిర్మించిన పైలాన్ ను ప్రధాని మోడీ ఆవిష్కరించారు. అక్కడి నుంచి నేరుగా మియాపూర్ మెట్రో స్టేషన్లోకి వెళ్లారు. మెట్రో రైలులో ఎక్కి ప్రధాని మోడీ ప్రయాణిస్తారు. మియాపూర్ నుంచి కూకట్ పల్లి వరకూ ప్రధాని మోడీ పర్యటన ఉంటుది. ప్రధాని వెంట గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రికేసీఆర్, మంత్రి కేటీఆర్ లు ఉన్నారు. మెట్రో రైలులోకేవలం ప్రధానివెంట 20 మంది మాత్రమే ప్రయాణించారు. రేపటి నుంచి హైదరాబాద్ లో మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. అంతకు ముందు మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్వాహకులు రూపొందించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను మోడీ తిలకించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ను ప్రధాని జాతికి అంకితం చేశారు.