రాజ్యసభ స్థానాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం బీజేపీకి మూడు, కాంగ్రెస్ కు ఒక స్థానం దక్కింది. కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి పశ్చిమ బెంగాల్ నుంచి విజయం సాధించారు. తృణమూల్ కాంగ్రెస్ మద్దతుతో ఆయన విజయం సునాయాసమయింది. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో పోటీ చేసింది. దాని గెలుపు ఎటూ ఖాయమే. ఐదో స్థానానికి కాంగ్రెస్, సీపీఎం పోటీ పడగా చివరకు కాంగ్రెస్ అభ్యర్థి సింఘ్వి విజయం సాధించారు. అలాగే ఉత్తర ప్రదేశ్ నుంచి కేంద్ర ఆర్థిక శాఖమంత్రి అరుణ్ జైట్లీ ఎన్నికయ్యారు. ఉత్తరాఖండ్ నుంచి బీజేపీ నేత అనిల్ బలూనీ విజయం సాధించారు. చత్తీస్ ఘడ్ నుంచి సరోజ్ పాండే ఎన్నికయ్యారు. ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది.