బ్రేకింగ్ : ఫైళ్లను పట్టుకెళ్లిన రేవంత్

Update: 2017-10-26 06:58 GMT

టీటీఎల్పీ నుంచి రేవంత్ తప్పుకున్నట్లే కన్పిస్తోంది. టీటీఎల్పీ సమావేశానికి ఎవరూ హాజరుకాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. తాను అధినేత వచ్చిన తర్వాత అన్ని విషయాలు చెబుతామన్నా టీటీడీపీ నేతలు విన్పించుకోవడం లేదన్నారు. అధినేత వద్దనే అన్ని విషయాలను తేల్చుకుంటామన్నారు. టీడీఎల్పీ కార్యాలయంలో ఉన్న కంప్యూటర్లో ఫైళ్లను కూడా రేవంత్ ఇంటికి తీసుకెళ్లిపోయారు. టీడీఎల్పీ గదిని కూడా రేవంత్ ఖాళీ చేయనున్నారని తెలిసింది. ఇక గోల్కొండ హోటల్ లో జరిగే కార్యక్రమానికి రేవంత్ హాజరవుతారా? లేదా? అన్నది తేలలేదు. తనపై కొందరు అనసవరంగా ఆరోపణలు చేస్తున్నప్పటికీ ఎవరూ స్పందించకపోవడం విచారకరమన్నారు. చంద్రబాబు హైదరాబాద్ కు చేరుకునే లోపే పార్టీని కొందరు భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. మొత్తం మీద టీడీఎల్పీ ఆఫీస్ నుంచి తనకు సంబంధించిన ఫైళ్లను రేవంత్ పట్టుకుపోవడంతో ఆయన పార్టీనుంచి నిష్క్రమణ తొందర్లోనే ఉన్నట్లు కన్పిస్తుంది.

Similar News