పవన్ ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆలయం నుంచి తన రాజకీయ యాత్ర ప్రారంభించనున్నట్లు తెలిపారు. 2009లో పెనుప్రమాదం నుంచి ఇక్కడే బయటపెట్టానని తెలిపారు. తన పర్యటన వివరాలను కొండగట్టులో ప్రకటిస్తానని చెప్పారు. అయతే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లేది ఎప్పుడనేది రేపు ప్రకటిస్తానని చెప్పారు. నాకుటుంబ ఇలవేల్పు కొండగట్టు ఆంజనేయస్వామి అని అన్నారు. దీంతో పవన్ రాజకీయ యాత్రను త్వరలోనే ప్రారంభించనున్నట్లు చెప్పారు. జనసేన అధ్యక్షుడు ఇక జనంలోకి వస్తానని ట్వీట్ చేయడంతో ఆయన అభిమానులు సంబరపడి పోతున్నారు.
పవన్ ట్వీట్ ఇదే....
‘‘నా అప్రహిత రాజకీయ యాత్రను తెలుగునేల పై పుణ్యస్థలమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ప్రారంభించనున్నాను. 2009 ఎన్నికలకు ప్రచారం చేస్తున్న తరుణంలో సంభవించిన పెను ప్రమాదం నుంచి నేను ఇక్కడే క్షేమంగా బయటపడ్డాను. దానికి తోడు మా కుటుంబ ఇలవేల్పు ఆంజనేయ స్వామే కావడం కూడా ఇక్కడి నుంచి నా నిరంతర రాజకీయ యాత్రను ఆరంభించడానికి కారణభూతమైంది. సర్వమత ప్రార్థనల అనంతరం రెండు రాష్ట్రాల ప్రజల ఆశీస్సుల కోసం సమస్యలను అధ్యయనం చేసి అవగాహన చేసుకోవడానికి ఈ యాత్ర ద్వారా మీ ముందుకు వస్తున్నాను. నా పర్యటన ప్రణాళికను కొండగట్టులో ప్రకటిస్తాను. నన్ను ఆశీర్వదించండి’’ - పవన్ కల్యాణ్