బ్రేకింగ్ : నీటిపారుదల రంగానికి అత్యధికంగా

Update: 2018-03-08 06:45 GMT

సాగునీటి రంగానికి అత్యధికంగా 16, 978 కోట్లను కేటాయించారు. రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయడమే లక్ష్యంగా ఈ శాఖకు అత్యధికంగా ఈ వార్షిక బడ్జెట్ లో నిధులను కేటాయించడం విశేషం. పోలవరం ప్రాజెక్టుతో పాటు వెలిగొండ, గాలేరు -నగరి, హంద్రీ నీవా, వంశధార, నాగావళి వంటి ప్రాజెక్టులకు ఈ నిధులను కేటాయించనున్నారు. కృష్ణా, పెన్నా, గోదావరి, నాగావళి, వంశధార నదుల అనుసంధానమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆర్థిక మంత్రియనమల రామకృష్ణుడు తెలిపారు. ఇందులో పోలవరం ప్రాజెక్టు ఒక్కదానికే తొమ్మిది వేల కోట్ల రూపాయలను కేటాయించినట్లు యనమల తెలిపారు.

Similar News