బ్రేకింగ్ : దినకరన్ దే విజయం... డీఎంకేకు దక్కని డిపాజిట్

Update: 2017-12-24 11:35 GMT

ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ ఘన విజయం సాధించారు. డీఎంకేకు డిపాజిట్లు కూడా దక్కలేదు. విజయం వరించగానే పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన సెంగొట్టియన్ దినకరన్ ను కలిశారు. దినకరన్ ఇంటి దగ్గర పెద్దయెత్తున సంబరాలు జరుపుకున్నారు. తొలి రౌండ్ నుంచి దినకరన్ ఆధిక్యతను ప్రదర్శిస్తూనే ఉన్నారు. దినకరన్ కు దాదాపు 30 వేలకు పైగామెజారిటీతో దినకరన్ గెలుపొందారు. దినకరన్ అమ్మ జయలలిత, ఎంజీఆర్ సమాధిల వద్ద నివాళుర్పించారు. అయితే ఈ ఎన్నికల్లో డీఎంకేకు భంగపాటు తప్పలేదు. డిపాజిట్ కూడా కోల్పోయింది.

Similar News