మేఘాలయలో కాంగ్రెస్ తిరిగి అధికారం నిలబెట్టుకునేదిశగా సాగుతోంది. మేఘాలయలో మొత్తం 60 స్థానాలుండగా కాంగ్రెస్ ఇప్పుడు 20 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ ఐదు స్థానాల్లోనూ, ఎన్.పి.పి. 9 స్థానాల్లోనూ, స్వతంత్రులు ఒక స్థానంలోనూ ముందంజలో ఉన్నాయి. మేఘాలయలో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.