కడప జిల్లాలో టీడీపీ నేతపై వైసీపీ నేత కాల్పులు జరిపాడు. కడప జిల్లా వీఎన్ పల్లి మండలం వీర్లపల్లె గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. టీడీపీ నేత భాస్కర రెడ్డిపై వైసీపీ నేత శ్రీనివాసులు రెడ్డి కాల్పులు జరిపాడు. రెండు రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో భాస్కరరెడ్డికి తీవ్రగాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాసులు రెడ్డికి, భాస్కరరెడ్డికి మధ్య ఉన్న పాతకక్షలే ఈ కాల్పులకు కారణంగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరూ మండలస్థాయి పార్టీ నేతలేనని తెలుస్తోంది.