బ్రేకింగ్ : టీడీపీ ఎంపీల రాజీనామాలు నెల ముందే...!

Update: 2018-02-15 13:32 GMT

వైసీపీ వ్యూహానికి టీడీపీ ప్రతి వ్యూహం అమలు చేస్తోంది. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే తమ పార్టీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తామని మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రకటించారు. సమస్యలను పరిష్కరించకుంటే మార్చి 5వ తేదీనే రాజీనామాలు చేస్తామని మంత్రి ఆదినారాయణరెడ్డి చెప్పారు. మార్చి 5న పార్లమెంటు ప్రారంభమయ్యే తేదీనే సమస్యలపై ప్రకటన రావాలని, లేకుంటే అదే రోజు రాజీనామాలు చేస్తామని మంత్రి ఆదినారాయణరెడ్డి సంచలన ప్రకటన చేశారు. అదే రోజు బీజేపీతో తెగదెంపులు చేసుకుంటామని చెప్పారు. జగన్ చంద్రబాబుకు సవాల్ విసిరిన గంటలోనే మంత్రి ఆదినారాయణరెడ్డి స్పందించడం విశేషం. ఏప్రిల్ 6వ తేదీన వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తారని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిని టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ ఖండించారు. ఇంకా తేదీ ఖరారు కాలేదని చెప్పారు. తొలుత కేంద్రమంత్రులు రాజీనామా చేసి బయటకు వస్తారని, తర్వాత చంద్రబాబు నిర్ణయం మేరకు మిగిలిన ఎంపీలు రాజీనామా చేస్తారని చెప్పారు. సరైన సమయంలో తమ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. తమకు మంత్రి పదవులు, ఎంపీ పదవుల లెక్కగాదన్నారు.

Similar News