సినీనటుడు గుండు హనుమంతరావు మృతి చెందారు. దాదాపు 400 సినిమాల్లో నటించిన హనుమంతరావు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న గుండు హనుమంతరావు గత కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. 61 సంవత్సరాల వయస్సున్న హనమంతరావు 1966 అక్టోబర్ 10వ తేదీన విజయవాడలో జన్మించారు. 18 ఏళ్ల వయస్సులోనే నాటకరంగంలోకి ప్రవేశించిన గుండు హనుమంతరావు ఈరోజు మృతి చెందారు. అహనా పెళ్లంట చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన గుండు హనుమంతరావు అనేక చిత్రాలు, టీవీల్లో వివిధ సీరియల్స్ లో నటించారు. గుండు హనుమంతరావు మృతితో టాలివుడ్ లో విషాదం అలుముకుంది. మూడుసార్లు నంది అవార్డులు అందుకున్న హనుమంతరావు టీవీలో అమృతం సీరియల్ తో బాగా పాపులర్ అయ్యారు.