వైసీపీ చేపట్టిన హోదా ఉద్యమానికి మద్దతివ్వాలని విద్యార్థి లోకానికి వైఎస్ జగన్ పిలుపు నిచ్చారు. హోదా ఉద్యమంలో భాగస్వాములు కావాలని జగన్ గుంటూరు జిల్లాలోని పేరేచర్లలో జరిగిన బహిరంగ సభలో ఆయన పిలుపు నిచ్చారు. హోదా ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లేందుకు వైసీపీ సిద్ధమవుతుందని చెప్పారు. బడ్జెట్ సమావేశాల చివరి వరకు హోదాపై కేంద్రం దిగిరాకుంటే ఎంపీలు రాజీనామాలు చేస్తారన్నారు. ఏపీ భవన్ వేదికగా ఎంపీలు ఆమరణ దీక్షకు దిగనున్నారని జగన్ ప్రకటించారు. ఎంపీల దీక్షకు సంఘీభావంగా నియోజకవర్గాల్లో రిలే దీక్షలు ఉంటాయని జగన్ తెలిపారు.టీడీపీ ఎంపీలు కూడా తమకు మద్దతుగా రాజీనామా చేయాలన్నారు. వాళ్ల కలసి వచ్చినా...రాకున్నా తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని వెల్లడించారు.