వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు డీజీపీ సాంబశివరావు అనుమతిచ్చారు. ఈరోజు డీజీపీ సాంబశివరావును వైసీపీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్థసారధి కలిసి జగన్ పాదయాత్ర రూట్ మ్యాప్ ను డీజీపీ సాంబశివరావుకు అందించారు. ఎక్కడెక్కడ బహిరంగ సభలు ఉంటాయో కూడా తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే జగన్ పాదయాత్రకు అనుమతిస్తున్నట్లు డీజీపీ సాంబశివరావు తెలిపారు. కాగా జగన్ పాదయాత్ర ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. జిల్లా స్థాయిలో ఎస్పీలకు ముందస్తు సమాచారం ఇవ్వాలని డీజీపీ సాంబశివరావు తెలిపారు.