వైసీపీ అధినేత పాదయాత్రలో తొలి అభ్యర్థిని ప్రకటించారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో కృష్ణగిరిలో జగన్ సంచలన ప్రకటన చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గానికి సంబంధించి శ్రీదేవిని అభ్యర్థిగా జగన్ ప్రకటించారు. ఇటీవల హత్యకు గురైన చెరుకుల పాటి నారాయణరెడ్డి భార్య శ్రీదేవి. పత్తికొండ నియోజకవర్గంలో కేఈ బ్రదర్స్ ను ఎదుర్కొనాలని నారాయణరెడ్డి తీవ్ర ప్రయత్నమే చేశారు. అయితే ఆయన దారుణ హత్యకు గురయ్యారు. ఇందులో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష‌్ణమూర్తి కుమారుడు ప్రమేయం ఉందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో పత్తికొండ నియోజకవర్గానికి 2019 ఎన్నికల్లో శ్రీదేవి వైసీీపీ అభ్యర్థిగా జగన్ ప్రకటించారు. 2014 ఎన్నికల్లో కేఈ కృష్ణమూర్తి మీద కాంగ్రెస్ అభ్యర్థి నారాయణరెడ్డి అతి తక్కువ మెజారిటీతో ఓడిపోయారు. కాగా ప్రజాసంకల్ప యాత్రలో తొలిసారి జగన్ అభ్యర్థిని ప్రకటించడం విశేషం.