ప్యారడైజ్ పేపర్ల లీకుపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. తనకు విదేశాల్లో ఆస్తులున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, నిరూపించకుంటే చంద్రబాబు తప్పుకుంటారా అని ప్రశ్నించారు. ఇందుకు ముఖ్యమంత్రికి పదిహేను రోజులు గడువిస్తున్నానని జగన్ పేర్కొన్నారు. గత రెండు రోజులుగా ప్యారడైజ్ పేపర్ల లీకుల్లో తన పేరు ఉందని టీడీపీ విష ప్రచారం చేస్తుందని జగన్ ఆరోపించారు. దీనిపై పాదయాత్రలో ఉన్న జగన్ తన స్పందనను తెలియజేశారు.