బ్రేకింగ్ : చంద్రబాబు చేతులెత్తేశారా?

Update: 2017-11-30 12:10 GMT

పోలవరం పై కేంద్ర వైఖరికి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మధనపడుతున్నారు. ప్రతిపనికీ కేంద్రానికి మోకాలడ్డుతుందని చంద్రబాబు అభిప్రాయపడుతున్నాు. పోలవరం టెండర్లు ఆపాలంటూ కేంద్ర జలవనరుల శాఖ లేఖ రాయడంపై ఆయన అసెంబ్లీలోనూ, మీడియా చిట్ చాట్ లోనూ మాట్లాడారు. విభజన హామీల విషయంలో తాను రాజీపడే ప్రసక్తి లేదని చెప్పారు. పోలవరం టెండర్లు విషయంలో ఆపమంటే ఆపేస్తానని చెప్పారు. కేంద్రం ఇదే వైఖరిని అవలంబిస్తే ఒక నమస్కారం పెట్టి పోలవరం ప్రాజెక్టు విషయాన్ని కేంద్రానికే అప్పజెబుతానని చంద్రబాబు అన్నారు. కేంద్రమంత్రితో చర్చించాకే తాము టెండర్లు పిలిచామన్నారు. నష్టపోయిన రాష్ట్రంగా హామీల అమలుకు ప్రయత్నం చేస్తూనే ఉంటామన్నారు. మిత్రపక్షం కాబట్టే సంయమనంగా వ్యవహరిస్తున్నామన్నారు. మొత్తం మీద కేంద్రం వైఖరికి చంద్రబాబు తీవ్రంగా బాధపడుతున్నట్లు తెలిసింది. ఇలాగే కొనసాగితే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేమన్నారు. చంద్రబాబు మాత్రం బీజేపీ సర్కార్ తీరుపై తీవ్ర స్థాయిలోనే చర్చ జరపాలని నిర్ణయించుకున్నారు.

Similar News