గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీని తిరిగి శాసనసభపక్షం ఎన్నుకుంది. ఈ మేరకు అరుణ్ జైట్లీ ప్రకటించారు. గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీని తప్పిస్తారన్న ప్రచారాన్ని పక్కన పెడుతూ తిరిగి విజయ్ రూపానీకే బీజేపీ అధిష్టానం పట్టం కట్టింది. ఉప ముఖ్యమంత్రిగా తిరిగి నితిన్ పటేల్ ను నియమించింది. మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలను విజయ్ రూపానీ స్వీకరించనున్నారు.