గాయకుడు గజల్ శ్రీనివాస్ బెయిల్ పిటీషన్ ను కోర్టుకొట్టివేసింది. దీంతో గజల్ కు కోర్టులోచుక్కెదురయింది. గజల్ కు సంబంధించిన సీడీలను ఎస్ఎఫ్ఎల్ కు పంపుతున్నామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పడంతో కోర్టు సీరియస్ అయింది. తమ అనుమతి లేకుండా ఫోరెన్సిక్ ల్యాబ్ కు ఎలా పంపుతారని ప్రశ్నించింది. ఈ కేసులో ఎ2 నిందితురాలు పార్వతి పరారీలో ఉందని న్యాయస్థానానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్వతి మీడియా ఇంటర్వ్యూలు ఇస్తుంటే ఎలా పరారీలో ఉన్నారనిచెబుతారని ఆగ్రహం వ్యక్తం చేసింది. గజల్ శ్రీనివాస్ కు బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తారన్న వాదనను న్యాయస్థానం అంగీకరించి గజల్ శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.