2జీ స్కాం కేసులో కనిమొళికి, రాజాకు ఊరట లభించింది. ఈకేసులో కనిమొళిని, రాజాను నిర్దోషులుగా పాటియాలా ప్రకటించింది. 2జీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారందరినీ నిర్దోషులుగా తేల్చడంతో డీఎంకే కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ కేసు విచారణ 2011 నుంచి జరుగుతోంది. నేరం నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమయిందని పాటియాలా కోర్టు తెలిపింది. ఈ సమయంలో భావోద్వేగంతో కనిమొళి కన్నీరు పెట్టుకున్నారు. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు ను ఆశ్రయించనున్నట్లు సీబీఐ, ఈడీ వర్గాలు వెల్లడించాయి. తీర్పు వచ్చిన వెంటనే ఎ.రాజాను కనిమొళి ఆలింగనం చేసుకున్నారు.