కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీఎన్నికకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 19వ తేదీన నోటిఫఇకేషన్. జనవరి 12వ తేదీన పోలింగ్ ఉంటుంది. జనవరి 16 వతేదీన కౌంటింగ్ ఉంటుంది. కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక జరగనుంది. శిల్పా చక్రపాణిరెడ్డి ఎమ్మెల్సీగా గెలిచిన ఐదు నెలల్లోనే తాను గెలిచిన తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు. దీంతో మరోసారి ఇక్కడ ఎన్నిక జరగనుంది.