బ్రేకింగ్ : ఆస్పత్రిలో జయలలిత వీడియో సంచలనం

Update: 2017-12-20 06:00 GMT

ఆర్కేనగర్ ఉప ఎన్నిక జరగుతున్న సమయంలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆస్పత్రిలోచికిత్స పొందుతున్న వీడియో ఒకటి విడుదలయింది. జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పాలు తాగుతున్నట్లుగా ఈ వీడియో ఉంది. అయితే ఈ వీడియోను దినకరన్ వర్గం విడుదల చేసినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. రేపు ఆర్కే నగర్ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతున్న సమయంలో ఈ వీడియో విడుదలకావడం సంచలనం కల్గిస్తోంది. ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో లబ్దిపొందేందుకే ఈ వీడియోను విడుదలచేశారని అన్నాడీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. జయలలిత మరణించి ఏడాది అయినా విడుదల కాని వీడియో పోలింగ్ కు ఒక్క రోజు ముందు విడుదల చేయడంపై ప్రత్యర్థి పార్టీలు విమర్శలు విన్పిస్తున్నాయి. శశికళ ఈ వీడియోను తీసినట్లుగా దినకరన్ వర్గం ఎమ్మెల్యే వట్రివేల్ తెలిపారు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లేనని అన్ని పార్టీలూపేర్కొంటున్నాయి.

Similar News