బ్రేకింగ్ : ఆ రెండింటిలో బీజేపీ వెనుకంజ

Update: 2018-03-14 06:41 GMT

ఉత్తరప్రదేశ్ లో జరిగిన రెండు లోక్ సభ స్థానాల ఉప ఎన్నికల్లో బీజేపీ వెనకబడి ఉంది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ ప్రాతినిధ్యం వహించిన గొరఖ్ పూర్ లో రెండు రౌండ్లు ఆధిక్యంలో కొనసాగిన కమలం పార్టీ మూడో రౌండ్ కు వచ్చేసరికి వెనకబడింది. సమాజ్ వాదీ పార్టీ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. యోగీ ఆదిత్యానాధ్ ముఖ్యమంత్రి కావడంతో రాజీనామా చేశారు. ఇక యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య గతంలో ప్రాతినిధ్యం వహించిన ఫూల్ పూర్ నియోజకవర్గంలో సమాజ్ వాదీ పార్టీ ఆధిక్యంలో ఉంది. గొరఖ్ పూర్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. దీంతో మీడియా సిబ్బందిని పోలీసులు బయటకు పంపారు.

Similar News