శాసనసభ్యత్వం రద్దయిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ లకు హైకోర్టులో కొంత ఊరట లభించింది. అయితే వీరిద్దరూ తమ శాసనసభ్యత్వం రద్దుపై హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు ఆరు వారాల పాటు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయవద్దంటూ ఎన్నికల కమిషన్ ను ఆదేశించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో వీరికి కొంత ఊరట లభించింది. గవర్నర్ ప్రసంగం సందర్భంగా శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ పై హెడ్ ఫోన్స్ విసరడంతో ఆయన గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరి శాసనసభ్యత్వాలను స్పీకర్ రద్దు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సీసీటీవీ ఫుటేజీని హైకోర్టుకు సమర్పించాలని అడ్వకేట్ జనరల్ ను హైకోర్టు ఆదేశించింది.