బ్రేకింగ్ : అసెంబ్లీలో అసాధారణ సంఘటన... స్వామిగౌడ్ కు గాయాలు

Update: 2018-03-12 05:47 GMT

గవర్నర్ ప్రసంగం సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో అవాంఛనీయ సంఘటన చోటుచేసుకుంది. గవర్నర్ ప్రసంగం ప్రారంభం నుంచే కాంగ్రెస్ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. గవర్నర్ ప్రసంగ పాఠానికి సంబంధించిన పత్రాలను చించి విసిరేసి తమ నిరసనను తెలియజేశారు. రైతు ఆత్మహత్యలను నివారించాలంటూ కాంగ్రెస్ సభ్యులు ఆందోళనచేశారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మైకును వేదికపైకి విసిరేశారు. గాల్లోంచి వచ్చిన మైకు గాంధీ ఫొటోకు తగిలి సభా వేదికపై ఉన్న శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్ కు తగిలింది. ఈ సందర్భంగా స్వామిగౌడ్ కంటికి తగిలింది. దీంతో స్వామిగౌడ్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. రేపు కోమటిరెడ్డిపై చర్యలు తీసుకునే అవకాశముందని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. గవర్నర్ ప్రసంగం అంతా అబద్ధాలపుట్ట అంటూ కాంగ్రెస్ సభ్యులు తమ నిరసనను వ్యక్తం చేశారు.

Similar News