టి టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన సంచలన వ్యాఖ్యలపై ఏపీ టిడిపి పూర్తి స్థాయిలో కోలుకోలేకపోతుంది. ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు కాంట్రాక్ట్ వ్యాపారాలు, పరిటాల పయ్యావుల కుటుంబాల మద్యం వ్యాపారాలపై ఒంటికాలిపై రేవంత్ లేచి తుక్కు తుక్కు కింద తమ పార్టీ వైఖరిని కడిగేశారు. ఇంత జరిగినా అధినేత చంద్రబాబు, యనమల కూడా విదేశ పర్యటనలో ఉండటంతో బాటు బాబు సంయమనం పాటించాలనడంతో ఎవరికి వారు మౌన ముద్ర దాల్చారు. ఇలా మౌనంగా ఉంటే రేవంత్ చేసిన ఆరోపణలు సత్యమని ప్రజలు నమ్మే పరిస్థితి ఉందని భావించిన యనమల తన శిష్యుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బొత్తిగా తనతరఫున ఒక్కరైనా మాట్లాడకపోతే బాగోదని ఆయన తనదారి తాను చూసుకున్నారు.
రేవంత్ కి పిఠాపురం ఎమ్యెల్యే వర్మ కౌంటర్ ...
ఇక ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు తరపు వకాల్తా పుచ్చుకున్న తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్యెల్యే వర్మ రేవంత్ పై ధ్వజమెత్తారు. కాంట్రాక్టులు పుచ్చుకున్నారని ఆరోపిస్తే సరిపోతుందా వాటికి టెండర్లు వంటి ప్రక్రియలు వుంటాయని రేవంత్ కు తెలియదా అన్నారు. యనమల జోలికి వస్తే సహించమని ఆయన రాజకీయ అనుభవం అంత వయస్సు రేవంత్ కి లేదన్నారు. మరోవైపు పరిటాల , పయ్యావుల కుటుంబాలు గట్టిగా తెలంగాణాలో తమ మద్యం వ్యాపారాలకు మాట్లాడింది లేదు. కనీసం వారి తరపున ఎవరు వారికి కేసీఆర్ తో వ్యాపార సంబంధాలు లేవని స్పష్టం చేయకపోవడం చర్చనీయాంశంగా మారుతుంది.