తెలుగుదేశం రాజ్య సభ సభ్యుడు టీజీ వెంకటేశ్ బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును ఎవరూ తక్కువగా అంచనా వేయొద్దన్నారు. తెలివైన వాళ్లెవ్వరూ మొదట్లోనే తగాదాలు పెట్టుకోరన్నారు. ప్రేమతో రాబట్టాల్సిందంతా ఇప్పటి వరూ రాబట్టామన్నారు. బీజేపీకి పూర్తి మెజారిటీ ఉండబట్టే ఎవరినీ లెక్క చేయడం లేదన్నారు. పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా వ్యవహరించడం లేదని అభిప్రాయపడ్డారు. ఏపీకోసం పార్లమెంటు లోపల, బయట పోరాటం ఉంటుందని టీజీ చెప్పారు. దశలవారీగా ఆందోళనకు దిగుతామన్నారు. తొలి దశలో కేంద్రమంత్రులు రాజీనామా చేస్తారని, రెండో దశలో ఎంపీలు రాజీనామా చేస్తారని చెప్పారు. ఇక ఫైనల్ గా తెగదెంపులేనన్నారు. బీజేపీ పొగరుకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందేనని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. టీజీ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.