మధ్యప్రదేశ్ లో ఈరోజు వెలువడిన స్థానికసంస్థల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకామోగించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ఈ ఏడాదే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఫలితాలు కమలనాధులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఈ నెల 17న మధ్యప్రదేశ్ లోని ఐదు జిల్లాల్లో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, 51 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఈరోజు కౌంటింగ్ జరుగుతోంది. అయితే కొద్దిసేపటి క్రితం వెలువడిన రాఘవగఢ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయకేతనం ఎరుగ వేసింది. రాఘవ్ గఢ్ నగర్ మున్సిపాలిటీలో 24 వార్డులుంటే... అందులో 20 స్థానాలను హస్తం పార్టీ కైవసం చేసుకుంది. బీజేపీకి కేవలం నాలుగు స్థానాలే దక్కాయి. ఇంకా మిగిలిన స్థానాలకు ఫలితాలు వెలువడాల్సి ఉంది.