బీజేపీకి జగన్ మరింత దగ్గరయ్యేందుకేనా?

Update: 2017-12-02 01:30 GMT

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర 24వ రోజుకు చేరుకుంది. అయితే పోలవరంపై గత రెండు రోజులుగా ఇంత రాద్ధాంతం జరుగుతున్నప్పటికీ జగన్ మాత్రం పాదయాత్రలో పోలవరం ప్రాజెక్టుపై పెద్దగా స్పందించడం లేదు. పైగా కేంద్ర ప్రభుత్వాన్ని సమర్ధిస్తూ జగన్ చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. పోలవరం లో అవినీతి జరుగుతుందని, అందువల్లనే కేంద్రప్రభుత్వం అడ్డుంటుందని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని జగన్ వెనకేసుకు వస్తుడంటం విశేషం. పోలవరంపై చంద్రబాబు ఉన్నది లేనట్లు... లేనిది ఉన్నట్లు చెబుతున్నారని జగన్ ఆరోపించారు. . కేంద్రం టెండర్లు పిలవనివ్వడం లేదని చంద్రబాబు నానా యాగీ చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖను తప్పుదోవపట్టిస్తున్నారనిజగన్ ఆరోపించారు. గ్లోబల్ టెండర్లకు కనీసం 45 రోజుల సమయం కావాలని, కాని చంద్రబాబు కేవలం మూడు వారాలే గడువు ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఇందుకు నిబంధనలు ఒప్పుకోవన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలియజేశారన్నారు.

టెండర్లలో అవకతవకను ప్రశ్నించడం తప్పా?

గత నెల 16వ తేదీన టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు నోటిఫికేషన్ ఇచ్చి 22వ తేదీ వరకూ వెబ్ సైట్ లో పెట్టకపోవడమేంటని జగన్ ప్రశ్నించారు. అంచనాలను 16 వేల కోట్ల నుంచి 58 వేల కోట్లకు పెంచి కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారని జగన్ తీవ్ర ఆరోపణలుచేశారు. టెండర్లు సక్రమంగా నిర్వహించాలని కేంద్రం కోరడం తప్పెలావుతుందని జగన్ కేంద్రాన్ని సమర్ధించారు. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యంగా కోస్తాంధ్రప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాని పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు పూర్తి కాదన్న సంగతి అందరికీ తెలిసిందే. వైఎస్ హయాంలో ఊపందుకున్న పోలవరం పనులను ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తోంది. అయితే పోలవరం పనులకు కేంద్రం కొర్రీలు వేస్తున్నా... .జగన్ మాత్రం బీజేపీని వెనకేసుకురావడం వెనక వ్యూహం ఉందంటున్నారు.

24వ రోజు పాదయాత్ర ఎలాగంటే...?

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర 24వ రోజుకు చేరుకుంది. శనివారం జగన్ పాదయాత్ర పత్తికొండ నుంచి ప్రారంభం కానుంది. రతన, తుగ్గిలి, గిరిగిట్ల మీదుగా మదనంతపురం క్రాస్ రోడ్డు వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్న భోజనానికి జగన్ ఇక్కడే ఆగుతారు. శుక్రవారం జగన్ 15.2 కిలోమీటర్ల పాదయాత్ర చేసినట్లు వైసీపీ నేతలు చెప్పారు. జగన్ ఇప్పటి వరకూ 330.6 కిలోమీటర్ల పాదయాత్రను చేశారు.

.

Similar News