విద్యార్థులు భారత భావిపౌరులంటారు. వారికి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లే పాలిటిక్స్ నేర్పుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయవద్దంటూ ఏకంగా స్కూల్ టీచర్లు విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించడం ఇప్పుడు సంచలనంగా మారింది. మధ్యప్రదేశ్ లో ఈ సంఘటన జరిగింది. మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. గత కొన్నేళ్లుగా మధ్యప్రదేశ్ ను బీజేపీయే ఏలుతుంది. అయితే మధ్యప్రదేశ్ లోని ఇటార్సీలో ఉన్న విజయలక్ష్మి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ టీచర్లు ఈ వివాదానికి కారణమయ్యారు.
విద్యార్థుల చేత ప్రతిజ్ఞ......
విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయబోమన్నది ఈ ప్రతిజ్ఞ సారాంశం. ప్రతిజ్ఞ చేయని వారికి రానున్న పరీక్షలకు అనుమతించబోమని కూడా టీచర్లు హెచ్చరించడం విశేషం. విద్యార్థులు ప్రతిజ్ఞ చేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ప్రభుత్వం ఆ విద్యాసంస్థపై చర్యలు తీసుకునే అవకాశముంది. అయితే ఈ సంఘటనపై నెటిజెన్లు తీవ్రంగానే స్పందిస్తున్నారు. విద్యార్థులపై ఇటువంటి ప్రయోగాలు చేయడం తగదని హెచ్చరిస్తున్నారు.