బిల్ గేట్స్ మందు పార్టీకి రమ్మంటే ...?

Update: 2017-11-18 02:30 GMT

రాజకీయాల్లో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఆయన. పీల్చే గాలి, తాగే నీరు, చెప్పే మాటా, చేసే ప్రతి పని రాజకీయకోణంలోనే చేస్తారు. ఏ ఆ ఆలోచన చేసినా రాజకీయం కోసమే అన్నట్లు ఆలోచించే మేధావి. ఆయనే ఏపీ సీఎం చంద్రబాబు. ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టి నేడు ప్రపంచ ధనవంతుడు బిల్ గేట్స్ పక్కన కూర్చో గలిగిన చంద్రబాబు ఆలోచన, క్రమశిక్షణ అందరికి స్ఫూర్తి ఆదర్శం. ఆయనపై ఎన్ని విమర్శలు వున్నా బాబు వేసే కొన్ని అడుగులు మిగిలిన వారికి ఆయనకు తేడాను స్పష్టం చేస్తాయి. తాజాగా విశాఖ సదస్సులో ఇరవైఏళ్ళ క్రితం బిల్ గేట్స్ ను కలవడానికి ఆయన పడ్డ అవస్థ చెప్పినప్పుడు కొన్ని ఆసక్తికర అంశాలు వెల్లడించారు చంద్రబాబు.

మందు పార్టీకి రమ్మంటే రాను పొమ్మన్నా ...

ప్రపంచంలో అత్యంత ధనవంతుడు బిల్ గేట్స్ ను కలవడానికి భారత రాయబారి ద్వారా ఇరవైఏళ్ళ క్రితం చంద్రబాబు ప్రయత్నం చేశారు. ఆయన ఎవరిని కలవడానికి ఇష్టపడరు. కావాలాంటే కాక్ టైల్ పార్టీలో కలిపిస్తా అని చెప్పారు రాయబారి. దానికి బాబు అంగీకరించలేదు. నే పార్టీకి వస్తే బయట మరో రకం ప్రచారం జరుగుతుంది. దానివల్ల ఓటు బ్యాంక్ పోతుందన్న భయం వ్యక్తం చేసి మరో ప్రయత్నంలో 10 నిమిషాలు అపాయింట్ మెంట్ సాధించారు. ఆ పదినిమిషాలు 40 నిమిషాలుగా తన చతురతతో మార్చేశారు బాబు. ఆ రోజుల్లోనే ల్యాప్ టాప్ ద్వారా పవర్ పాయింట్ గేట్స్ కి చూపడంతో ఆయన తానిచ్చిన సమయాన్ని పొడిగిస్తూ వెళ్ళారు. విశాఖ లో నిర్వహిస్తున్న వ్యవసాయ సదస్సులో గేట్స్ , బాబులు తమ పాత జ్ఞాపకాలను అందరికి తెలిపారు. రాజకీయాల్లో కొన్ని కావాలంటే కొన్ని వదులు కోవాలని బాబు చేసి చూపించి ఆదర్శం అయితే కొందరు టిడిపి ఎమ్యెల్యేలు స్టార్ హోటల్ లో రూమ్స్ కోసం విశాఖ లో తాగి అల్లరిచేయడం బాబు పరువు తీయడం ఇప్పుడు చర్చనీయాంశం, వివాదాస్పదం అయ్యాయి.

Similar News