గుర్మీత్ బాబా తో సకల భోగభాగ్యాలు అనుభవించిన ఆయన దత్త పుత్రిక ఇప్పుడు జైల్లో నానా కష్టాలు పడుతుంది. అంబాలా జైల్లో 11 వ నంబర్ గదిని ఆమెకు అధికారులు కేటాయించారు. ఆ గదిలో దోమలు తనను తెగ కుడుతున్నాయని హనీ హాహాకారాలు చేస్తున్నా పట్టించుకునే వారే లేరట. ఆమెకు తలదిండు కూడా లేకపోవడంతో నిద్ర పట్టని రాత్రుళ్ళు గడుపుతూ గుర్మీత్ ను కలుస్తానని జైలు అధికారులను వేడుకుంటుందిట. ఒక్కసారి గుర్మీత్ దగ్గరకు తీసుకువెళ్లాలని హానిప్రీత్ కలవరిస్తుందని జైలు వర్గాల సమాచారం.
బాబా అనుచరురాలు విపాసనతో వివాదం ...
గుర్మీత్ అరెస్ట్ తరువాత చెలరేగిన అల్లర్లకు తానే బాధ్యురాలినని అంగీకరించిన హానిప్రీత్ ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఇచ్చింది. కస్టడీ లో ఈ కేసు దర్యాప్తు చేస్తున్న వారితో ఆశ్రమంలో బాబా అనుచరురాలైన విపాసన స్కెచ్ కూడా ఇందులో ఉందంటూ ఆమెను కేసులోకి లాగింది. అధికారులు ఆమెకు నోటీసులు ఇచ్చి ఇద్దరినీ ఒకేసారి దర్యాప్తు చేశారు. అల్లర్లలో విపాసన పాత్ర ఉందని ఆగస్టు 17 ఆశ్రమంలో జరిగిన కుట్రలో ఆమె ఉందని చెప్పింది .తన ల్యాప్ టాప్ విలువైన డాక్యుమెంట్లు , మొబైల్ ఫోన్ విపాసనకే ఇచ్చానని హనీప్రిత్ తెలిపింది. విపాసన మాత్రం హానిప్రీత్ అన్ని అబద్ధాలు చెబుతుందని తనకు కేవలం ఐఫోన్ మాత్రమే ఆమె ఇచ్చిందని ఆగస్టు 17 న డేరాలో అల్లర్లకు స్కెచ్ వేసేందుకు జరిగిన సమావేశంలో తాను లేనేలేదని తేల్చి చెప్పింది . ఈ అంశంపై ఇరువురు తీవ్ర వాగ్వాదం చేసుకోగా అధికారులు మందలించాల్సి వచ్చింది.
కీలక సమాచారం డిలీట్ ఎవరు చేశారు ...?
హానిప్రీత్ ఉపయోగించే ఐ ఫోన్ ను విపాసన పోలీసులకు స్వాధీన పరిచింది. ఈ ఫోన్ లో కీలక సమాచారం డిలీట్ చేయబడిందని దర్యాప్తు అధికారులు గుర్తించారు. అంతే కాకుండా ఫోన్ యాక్సెస్ పాస్ వర్డ్ మార్చారని తేలింది. దాంతో నిపుణులద్వారా ఆ రహస్యాలు విప్పే పనిలో పడ్డారు పోలీసులు. అయితే హానిప్రీత్ ల్యాప్ టాప్ కీలక డాక్యుమెంట్లు ఎక్కడ దాచింది అనే సమాచారం ఇప్పటివరకు బయటపడలేదు. అవి లభిస్తే దర్యాప్తు దాదాపు పూర్తి అవుతుందని కేసులో కీలక సాక్ష్యంగా అవి పనికొస్తాయని పోలీసులు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు .