దేశీయ మార్కెట్ లో నిన్న మొన్నటి దాకా కొండెక్కిన బంగారం ధరలు దిగివచ్చాయి. పది గ్రాములకు 1500 ల రూపాయల వరకు ధర పడిపోయింది. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు జోష్ మీద ఉండటంతో ఈ పరిణామాలు ఏర్పడినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే నవంబర్ తో పెళ్ళిళ్ళ ముహర్తలు ముగిసి ఫిబ్రవరి వరకు తిరిగి లేకపోవడం కూడా చుక్కలు అంటిన ధరలు దిగిరావడానికి కారణం అంటున్నారు నిపుణులు. వాస్తవానికి పెళ్లిళ్లకు బంగారం ధర పెరుగుదలకు సంబంధం లేదని మరికొందరు అంటున్నారు.
హెచ్చు తగ్గులు సహజమే ...
స్టాక్ మార్కెట్లు పుంజుకున్నప్పుడు పసిడి ధర దిగిపోతుందని అవి డీలా పడినప్పుడు అమాంతం ధరలు పెరుగుతాయని మరికొందరు విశ్లేషిస్తున్నారు. మరోవైపు గత పది రోజులుగా రోజూ పసిడి ధర పతనం అవుతూ వస్తుండటంతో కొనుగోలు దార్లు లేక వ్యాపారాలు కళ తప్పాయి. అనేక జ్యువెలరీ షోరూం లు బోసిగా కనిపిస్తున్నాయి. పసిడి ధరల ఒడిదుడుకులు సహజమేనని అంతర్జాతీయ పరిణామాలను బట్టి ధర పెరుగుదల తగ్గుదల రొటీన్ గా జరిగేదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం 27310 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 29190 వుంది.రొటేషన్ ఆగిపోకుండా ఇప్పటికే పలు షోరూం లు కస్టమర్లకు ఆఫర్లు పెట్టినా ఫలితం కానరావడంలేదు.