ఫుడ్ లో ఈ నూనె వాడారో ఇక అంతే...

Update: 2017-10-13 00:30 GMT

ఆహార ఉత్పత్తులను కలిసి చేస్తున్న వారిపై కొరడా ఝుళిపించాలనిప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం ఎంత నిఘా పెట్టినా కల్తీ రాయుళ్లు మాత్రం ఆహార ఉత్పత్తులను కల్తీ చేస్తున్నారు. నకిలీ నూనె తయారీ కేంద్రం పై పోలీసుల దాడులు, పాతబస్తీలో ఉన్న ఫ్యాక్టరీపై దాడిచేసి వేలాది లీటర్ల నకిలీ పల్లీ నూనె ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పామాయిల్ నూనెల్లో రైస్ బ్రాండ్ ఆయిల్ కలిపి పల్లీ నూనె అంటూ విక్రయాలు చేస్తున్న కంపెనీలు హైదరాబాద్ లో కోకొల్లలు. పల్లీ నూనె అని కొనుగోలు చేస్తే పామాయిల్ పేరుతో రైస్ బ్రాండ్ ఆయిల్ ఉంటుందని పోలీసులు చెప్పారు. ఆంధ్ర, తెలంగాణ,మహారాష్ట్ర కర్ణాటక తమిళంలో పల్లీ నూనె కల్తీ చేస్తున్నట్లుపోలీసులు వెల్లడించారు.

అంతా కల్తీమయమే....

హైదరాబాదులోని బహదూర్పూరా ప్రాంతంలో ఉన్న రిఫైనరీ కంపెనీ పైన పోలీసు అధికారులు దాడి చేశారు. గతంలో కూడా పలు ఫిర్యాదులు వచ్చాయి. ఈ కంపెనీ చేసిన నూనెను వాడి అప్పుడు పలు అనారోగ్య సమస్యలు వచ్చాయని పోలీసులకు కొందరు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు. పలువురు కష్టమర్లు పోలీసులకు స్వయంగా వచ్చి ఫిర్యాదు చేశారు. తాము ఈ కంపెనీ తయారు చేస్తున్న వంట నూనెలను గత కొంతకాలం నుంచి వాడుతున్నామని తమకు అనారోగ్య సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ కంపెనీ ఇతర దేశాల నుంచి పామాయిల్ ను దిగుమతి చేసుకుంది.. ఇలా తీసుకువచ్చిన పామాయిల్ తో పాటు హైదరాబాదులో తెలంగాణ ప్రభుత్వం తయారుచేసిన విజయ వంటనూనెలలో ఇందులో కలిపి స్వచ్ఛమైన వేరుశనగ నూనెగా ప్రచారం చేసుకున్నారు.. వేరుశెనగ, వెజిటబుల్ ఆయిల్, దీపం ఉండేలా తయారు చేశారు. ఇలా తయారు చేసిన ఆ నూనెను ఐదు రాష్ట్రాలకు సరఫరా చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ కంపెనీ తన ఉత్పత్తుల్ని విక్రయాలు చేస్తుంది. ముఖ్యంగా చూసినట్లేతే వేరుశెనగ పేరుతో ప్యాకింగ్ చేస్తారు. ఎవరైనా చూసినా ఇది నిజంగా వేరుశనగ నూనె అనే అనుకుంటారు. పాకెట్ పైన బొమ్మలు వేస్తారు. నిజమైన వేరుశనగ నమ్మించే విధంగా ప్యాకింగ్ ఉంటుంది. ఈ ప్యాకింగ్ ఇందులోనే అసలైన గమ్మత్తు ఉంటుంది. వేరుశనగ నూనె అని ఉండటంతో సామాన్యులు దీన్ని కొనుగోలు చేస్తారు. ప్యాకెట్ లోపల మాత్రం పామాయిల్ రైస్ బ్రాన్ నూనె ఉంటుంది.

మీడియా ముసుగులో....

ఇటీవల కాలంలో ఈ కంపెనీపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ఆరంభించారు.. ఇందులో పామాయిల్ ను సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే సౌత్ జోన్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. కంపెనీ పైన ఆకస్మిక దాడులు చేశారు.. ఈ దాడుల్లో కంపెనీ నిజంగానే కల్తీ ఆయిల్ తయారు చేస్తున్నట్లుగా వెలుగు చూసింది. కంపెనీ మొత్తాన్ని అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. విదేశాల నుంచి తెప్పించిన పామాయిల్ ఇందులో ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. మరోవైపు ప్రభుత్వం తయారుచేసే విజయ నూనె కూడా పెద్ద మొత్తంలో కంపెనీ దొరికింది.. ఈ కంపెనీలో విజయ ఆయిల్ ఎందుకు ఉందన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆహార ఉత్పత్తులను కల్తీ చేసే వాళ్లపై అన్ని చర్యలు తీసుకోవాలనిప్రభుత్వం చెప్తుంది. ఈ దశలోనే పోలీసులు కల్తీ రాయుళ్లు గుర్తించి చర్యలు చేపడుతున్నారు. అక్కడక్కడ ఈ కల్తీ మాఫియా బయటపడుతుంది. ఇప్పుడు బయటపడ్డ ఈ కంపెనీ యజమాని రెండు రాష్ట్రాల ఆయిల్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేస్తున్నారు. దీంతోపాటుగా ఇటీవల కాలంలో ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఈయన ఏర్పాటు చేశాడు. ఎవరైన కంపెనీల్లో తనిఖీలకు వచ్చినట్లైతే మీడియా పేరుతో బెదిరిస్తుంటారు. మీ మీడియా ముసుగులో అక్రమ దందా చేస్తున్నారు.. ఇలాంటి వాళ్లని వదిలిపెట్టే ప్రసక్తి లేదని పోలీసులు అంటున్నారు.

Similar News