ఫలించిన బాబు ప్రయోగం ...!

Update: 2018-01-15 00:30 GMT

కొత్త కొత్త ప్రచారాలు కనిపెట్టడంలో ఏపీ సీఎం చంద్రబాబును మించిన వారు వుండరు. అలాగే మీడియా ను హైజాక్ చేయడం అందులో ఎలాంటి వార్తలకు ప్రాధాన్యం ఇస్తారో బాబుకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. 13 ఏళ్ళ ముఖ్యమంత్రి అనుభవాన్ని సొంతం చేసుకున్న చంద్రబాబు ఈసారి జన్మభూమికి కొత్త తరహా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తనను తన ప్రభుత్వాన్ని అధికారులు, ప్రజా ప్రతినిధులు పొగడటం లేదా తన పార్టీ అనుకూల పత్రికల్లో గొప్పగా రాయించడం అనుకూల ఛానెల్స్ లో దేశంలోనే ఈ తరహా ఎక్కడా లేదంటూ భజంత్రీలు వాయించడం ఆయన ఆర్ట్స్ లో ఒకటి. తాజాగా జరిగిన జన్మభూమిలో పాత ప్రచారాలు బోరు కొట్టిన బాబు రొటీన్ కి భిన్నంగా ట్రై చేసి సక్సెస్ అయ్యారు.

చిన్నారులే ప్రచారకర్తలుగా ...

చంద్రబాబు జన్మభూమిలో ఎక్కడ పాల్గొన్నా ప్రభుత్వ పాఠశాలకు చెందిన సామాన్య విద్యార్థుల్లో ఎంపిక చేసిన వారిలో ఒకరిద్దరు వేదిక ఎక్కుతారు. ముఖ్యమంత్రి సమక్షంలో ప్రసంగం మొదలు పెట్టి తమ అందరిని షాక్ కి గురిచేసే ప్రసంగాలు ఇస్తూ వుంటారు. ఆ చిన్నారి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను అద్భుతంగా చెప్పుకురావడం తెలుగు తమ్ముళ్ళు కిందనుంచి సంబరాలు చేయడం చంద్రబాబు కళ్ళల్లో కోటి కాంతులు పూయించింది. తనను తన ప్రభుత్వాన్ని పొగిడిన వారిని చూపిస్తూ వీరికి వున్న జ్ఞానం చాలామందికి రాలేదంటారు ఆయన. అంతేకాదు ఆ చిన్నారికి చదువు కు అయ్యే ఖర్చు ప్రోత్సహకాలు వేదికమీదే ప్రకటించేస్తారు సీఎం. ప్రభుత్వ పాఠశాల విద్యార్థి అలా బాబు కోసం మాట్లాడటానికి అధ్యాపకులు అద్భుత శిక్షణ ఇస్తుంటారు. తమ స్కూల్ లో వున్న వారిలో ఉత్తమ విద్యార్థులను ఎంపిక చేయి ముఖ్యమంత్రి ఎదుట పెర్ఫార్మ్ చేయిస్తారు. ఈ తరహా ప్రయోగం జన్మభూమిలో హిట్ కావడంతో రాబోయే ఎన్నికలకు ఇదే ఫార్ములా చంద్రబాబు అనుసరించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

Similar News