ప‌వ‌న్‌కి అదిరిపోయే పంచ్ ఇచ్చిన విజ‌యమ్మ‌...!

Update: 2018-01-29 12:30 GMT

జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు వైసీపీ గౌర‌వ అధ్య‌క్షురాలు వైఎస్ విజ‌య‌మ్మ అదిరిపోయే పంచ్ విసిరారు. గ‌త ఏడాది ఏపీలో మూడు రోజులు విస్తృతంగా ప‌ర్య‌టించిన ప‌వ‌న్‌.. ఈ సంద‌ర్భంగా వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను సూటిగా టార్గెట్ చేశాడు. కొంద‌రు అదికారం కోసం ఉబ‌లాట‌ప‌డుతున్నార‌ని అన్నాడు. సీఎం కుర్చీలో కూర్చోవాలంటే నాకు భ‌యం.. దానిలో కూర్చోవాలంటే.. అనుభవం ఉండాల‌ని చెప్పుకొచ్చాడు. అనుభ‌వం లేకుండానే సీఎం సీటు కోసం యాత్రలు చేస్తున్నారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్య‌లు అప్ప‌ట్లో తీవ్ర సంచల‌నం సృష్టించాయి. అయితే, దీనిపై వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. అప్ప‌ట్లోనే ఘాటుగా స్పందించాడు. ఏ అనుభ‌వంతో చిరంజీవి పార్టీ పెట్టి అధికారం కోసం పావులు క‌దిపాడంటూ ప్ర‌శ్నించారు.

అనుభవం ఒక్కటే....

ఇక‌, ఇప్పుడు తాజాగా జ‌గ‌న్ మాతృమూర్తి, వైసీపీ గౌర‌వ అధ్య‌క్షురాలు.. విజ‌య‌మ్మ‌ కూడా ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై ఘాటుగానే స్పందించారు. ఒక మీడియాకు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడారు. ఈ సంద‌ర్బంగా ఓ ప్ర‌శ్న‌కు స‌మాధాన మిస్తూ.. అనుభవం గురించి ప‌రోక్షంగా వ్యాఖ్యానించారు. నాయకుడికి అనుభవం కొంతమేర ఉపయోగపడొచ్చేమో కానీ అదే మొత్తం కాదన్న మాట చెప్పారు. అదేస‌మ‌యంలో చంద్ర‌బాబు అనుభ‌వాన్ని ప‌వ‌న్ మెచ్చుకోవ‌డాన్ని త‌ప్పు ప‌డుతూ.. ఆ అనుభ‌వం చంద్ర‌బాబుకు ఉన్న‌ట్ట‌యితే.. అంటూ.. హైకోర్టు కట్టారా? అసెంబ్లీ కట్టారా? అని సూటిగా ప్ర‌శ్నించారు. విజయమ్మ మాటను చూస్తే.. మరో విషయం కూడా అర్థంకాక మానదు.

సత్సంప్రదాయాలు ఏవీ...?

అనుభవం ఉన్న నేత రాజకీయాల్లో సత్సంప్రదాయాల్ని పెరిగేలా చేయాలే కానీ.. అడ్డగోలు రాజకీయాలు పనికిరావు. అంత అనుభవం ఉన్న చంద్రబాబు.. విపక్షానికి చెందిన ఎమ్మెల్యేల్ని ఎందుకు కొనుగోలు చేసినట్లు? ఒకవేళ పార్టీలో చేర్చుకుంటే.. వారి చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికల బరిలో నిలిచి గెలిపించుకోవచ్చు కదా? అనేది స్ప‌ష్టంగా వినిపించింది. అంతేకాదు, పదవులు చేపట్టటానికి అనుభవం కంటే కూడా మానవత్వం ఉండటం ముఖ్యం అనే విష‌యాన్ని విజ‌య‌మ్మ స్ప‌ష్టంగా చెప్ప‌క‌నే చెప్పారు. సో.. ప‌వ‌న్‌ను ఉద్దేశించి నేరుగా కాక‌పోయినా.. ప‌రోక్షంగా విజ‌య‌మ్మ చేసిన ఈ వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. మ‌రి జ‌న‌సేన ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Similar News