ప‌వ‌న్ ట్విస్ట్‌కు టీఆర్ఎస్‌లో అల‌జ‌డి...!

Update: 2018-01-04 00:30 GMT

సీఎం తెలంగాణ సీఎం కేసీఆర్‌ను జ‌న‌సేన అధినేత, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌ల‌వ‌డం, ఆయ‌న్ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్త‌డంపై ఇత‌ర పార్టీ నేత‌లు ఏమ‌నుకున్నా.. టీఆర్ఎస్‌లో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రైతుల‌కు 24 గంట‌ల విద్యుత్ ఇస్తున్న‌ట్లు కేసీఆర్ ప్ర‌క‌టించ‌డం తెలిసిందే! ఈ నేప‌థ్యంలో కేసీఆర్‌ను అభినందిం చ‌డంతో పాటు నూత‌న సంవత్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపేందుకు ప‌వ‌న్ క‌ల‌వ‌డం రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ప్ర‌ధాన ప్ర‌తిపక్షం కాంగ్రెస్ ఇప్పటికే విమర్శలు చేసింది. బీజేపీ నేత‌లు ఇంకా స్పందించ‌లేకున్నా.. టీఆర్ఎస్ నేత‌లు కొంద‌రు త‌మ ఆగ్ర‌హాన్ని, అసంతృప్తిని బ‌య‌టపెడుతున్నారు. ఉద్య‌మ స‌మ‌యంలో కేసీఆర్‌తోపాటు ఆయ‌న కుటుంబస‌భ్యులు, ప‌వ‌న్‌ మ‌ధ్య మాట‌ల యుద్ధాన్ని గుర్తుచేస్తూ.. పోస్టింగ్‌లు పెడుతున్నారు.

మింగుడు పడటం లేదా?

తెలంగాణ‌లో కొత్త సంవ‌త్స‌రం వేళ జ‌రిగిన ప‌రిణామాలు టీఆర్ఎస్ నాయ‌కుల‌కు మింగుడు ప‌డ‌టం లేదు. ప‌వ‌న్‌-కేసీఆర్ భేటీని కొంత‌మంది నాయ‌కులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. కొంద‌రు దీనిని క‌క్క‌లేక మింగ‌లేక ఇబ్బందులు ప‌డుతున్నారు. మ‌రికొంద‌రు మాత్రం నిర్మొహ‌మాటంగా తేల్చిచెప్పేస్తున్నారు. పెద్ద పెద్ద లీడర్లకే దొరకని పార్టీ అధినేత, సీఎం కెసీఆర్ అపాయింట్ మెంట్ పవన్ కళ్యాణ్ కు దొరకటంపై కొంత మంది నేతలు గుస్సాగా ఉన్నారు. అయితే వారెవరూ నోరుతెరకపోయినా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, మహిళా నేత వసుంధర సోషల్ మీడియాలో ఈ భేటీపై ఫైర్ అయ్యారు. ఈ ఆగ్ర‌హాన్ని త‌న‌ పేజీలో ఈ మేరకు పోస్టు చేశారు.

టీఆర్ఎస్ నేత పోస్టు ఇలా....

'చిన్న జీవి పెద్ద జీవి అని ఆడిపోసుకుంటివి కదా? ఇప్పుడు గిదేమి కథ సర్? ఇటువంటోల కోసమా తెలంగాణ సాధించుకుంది? ఇదేమి ఖర్మరా బాబు? సంతన్న ఇలాంటోలకు జల్ది అపాయింట్‌మెంట్ ఇస్తడు. సంతన్న మొఖంలో సంబరం చూడండి. తెలంగాణ ఇచ్చినందుకు బాగ ఏడ్సినోడు ఇప్పుడు తెలంగాణలో పోటి చేస్తాడట పవనాలు. దానికి ఇదే ఆహ్వానము' అంటూ ఆమె పోస్టు పెట్టారు. ఇదే అభిప్రాయం చాలా మంది టీఆర్ఎస్ నేతల్లో ఉంది. చాలా మంది బ‌య‌ట‌ప‌డ‌లేకుండా ఉన్నా.. ఆమె మాత్రం ధైర్యంగా పోస్టు పెట్ట‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్పుడు వైసీపీ కూడా సోషల్ మీడియా వేదిక‌గా ప‌వ‌న్ టార్గెట్ చేస్తూ ఎటాక్ మొదలు పెట్టింది.

ఇక వైసీపీ ఊరుకుంటుందా?

ఎన్నికల ముందు కేసీఆర్.. ఆంధ్రా వాళ్లను ఎన్ని తిడుతున్నా జగన్ మౌనంగా ఉన్నారని.. సీమాంధ్ర పౌరుషం ఏమైంది జగన్? అని అప్పట్లో పవన్ ప్రశ్నించారు. అంతే కాదు.. కేసీఆర్ నీ తాట తీస్తా అని ఓ బహిరంగ సభలో హెచ్చరించారు. ఇదే విషయాలను ప్రస్తావిస్తూ కేసీఆర్ ప్రస్తుతం అధికారంలో ఉన్నందున ఏమి చేస్తున్నాడో చూడండి అంటూ కేసీఆర్ కు వంగి దండం పెడుతున్న ఫోటోను పెట్టింది. అంతేగాక దీనికి ఒక క్యాప్ష‌న్ కూడా త‌గిలించేసింది. 'ఎప్పుడు వాగాలో కాదు.. ఎప్పుడు వంగాలో తెలిసినోడే ఫ్లవర్ స్టార్' అని సెటైరిక్‌గా పోస్టింగ్ పెట్టారు. మ‌రి టీఆర్ఎస్‌లో మ‌రింత మంది ముందుకొచ్చి త‌మ అసంతృప్తి బ‌య‌ట‌పెడ‌తారో లేదో వేచిచూడాల్సిందే! అంత‌కంటే ముఖ్య‌మైన విష‌యం.. వీటిపై కేసీఆర్ ఎలా స్పందిస్తారో!!

Similar News