ప్రొద్దుటూరు లో జగన్ ఫైర్

Update: 2017-11-12 00:30 GMT

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ఆరోరోజుకు చేరుకుంది. ఈ రాత్రికి ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో బసచేసే జగన్ రేపు ఉదయం 8.30గంటలకు పాదయాత్ర ప్రారంభిస్తారు. ప్రొద్డుటూరులో జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. తన మూడు వేల కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి ఒక్కరినీ కలసి సమస్యలను తెలుసుకుంటానన్నారు. ఆ సమస్యలనే మేనిఫేస్టోగా రూపొందిస్తామని జగన్ చెప్పారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మిస్తామనిచెప్పిన చంద్రబాబు నాలుగేళ్లవుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. చంద్రబాబు మోసానికి అన్ని వర్గాలూ బలయిపోయాయన్నారు. జగన్ ఐదో రోజు మొత్తం 13 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేశారు. ప్రధానంగా లోకల్ సమస్యను జగన్ ప్రస్తావిస్తున్నారు.కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం, ప్రొద్దుటూరు అభివృద్ది గురించి ఎక్కువగా జగన్ ప్రసంగించారు.

ఆరో రోజు 14కిలోమీటర్లు....

ఐదోరోజు పాదయాత్రను జగన్ ఎర్రకుంట్ల నుంచి ప్రారంభించారు. ప్రొద్డుటూరు లో ముగించారు. దారిపొడవునా మహిళలు, యువకులు పెద్దయెత్తున జగన్ కు స్వాగతం పలికారు. వాల్మీకి, బోయ సంఘాల నేతలు కలిసి తమను ఎస్టీ జాబీతాలో చేర్చాలని జగన్ నుకోరారు. 108 సిబ్బంది కలిసి తమ సమస్యలను జగన్ కువివరించారు. కాంట్రాక్టు లెక్చరర్లు కలసి తమ పరిస్థితిని జగన్ దృష్టికి తెచ్చారు. అందరి సమస్యలను మానిఫేస్టో్లో పెట్టి పరిష్కరిస్తానని జగన్ వారికి హామీ ఇచ్చారు. జగన్ ను ప్రొద్డుటూరు ఆస్పత్రి సిబ్బంది కూడా కలుసుకుని తమ సమస్యలను చెప్పారు. ఆరోరోజు పాదయాత్ర పొద్దుటూరు బైపాస్ రోడ్డు నుంచి ప్రారంభం కానుంది. ఆరో రోజు జగన్ 14 కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టనున్నారు.

Similar News