ప్రియాంక అందం గురించి ఆ ఎంపీ ఏమన్నారో తెలుసా?

Update: 2017-01-25 09:15 GMT

గాంధీ వారసురాలు ప్రియాంక గాంధీపై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక అందంపై ఈ ఎంపీ కామెంట్స్ విమర్శలకు దారితీసింది. ప్రియాంక గాంధీని ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రచార కర్తగా కాంగ్రెస్ పార్టీ నియమించింది. దీంతో ప్రియాంక వస్తే తమ గెలుపు ఖాయమని యూపీ కాంగ్రెస్ నేతలు సంతోషపడుతున్నారు. ప్రియాంక పర్యటనకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఆమె అమెధీ, రాయబరేలీ పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు.

అయితే ప్రియాంక కంటే అందమైన యువతులు దేశంలో చాలా మంది ఉన్నారని బీజేపీ ఎంపీ వినయ్ కతియార్ కామెంట్స్ చేశారు. ప్రియాంక కంటే యాక్టర్లు, ఆర్టిస్టులు అందంగా ఉంటారని కతియార్ అన్నారు. బీజేపీలోనూ అందమైన స్టార్ క్యాంపెయినర్లు చాలా మంది ఉన్నారని వినయ్ అన్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. వినయ్ కతియార్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. గాంధీ కుటుంబ వారసురాలిని పట్టుకుని అందంపై కామెంట్స్ చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Similar News