ప్రధాని హత్యకు కుట్ర...భగ్నం

Update: 2017-12-06 04:24 GMT

బ్రిటన్ ప్రధాని థెరాసా మేను చంపేందుకు చేసిన కుట్రను బ్రిటన్ పోలీసు బలగాలు భగ్నం చేశాయి. ఇద్దరు ఉగ్రవాదులు ప్రధానిని కాల్చి చంపేందుకు కుట్రపన్నారు. ఉత్తర లండన్ కు చెందిన నాయిముర్ జకారియా రహ్మాన్, వాయువ్య బర్మింగ్ హామ్ కు చెందిన అకిబ్ ఇమ్రాన్ లు థెరిసామ మే నివాసమైన డౌనింగ్ స్ట్రీట్ గేట్లను పేల్చి ఆ తర్వాత ప్రధానిని చంపాలని కుట్ర పన్నారు. అయితే ముందుగానే కుట్రను పసిగట్టిన భద్రతాదళాలు భగ్నం చేశాయి. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నాయి. ప్రధాని నివాసం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Similar News