ప్రతి మండే అగ్రిగోల్డ్ కేసు విచారణ

Update: 2017-03-07 05:21 GMT

ఇక నుంచి ప్రతి సోమవారం అగ్రిగోల్డ్ కేసు విచారణ చేపడుతామని స్పష్టం చేసింది హైకోర్టు. ఆస్తుల వేలం పక్రియలో అలస్యం అవుతున్నందున ఈ నిర్ణయం తీసుకుంది. ఇక అసోసియేషన్ పేరుతో కస్టమర్ల వద్ద మళ్లీ డబ్బులు వసూలు చేస్తున్న మూఠా పై కర్నూల్ ఎస్పీ నివేదిక సమర్పించారు. హైకోర్టు పేరును వాడుకోని 44 లక్షల రూపాయలు వసూలు చేశారని తెలిపారు. అయితే ఈ మూఠాకి అగ్రిగోల్డ్ సంస్థకు సంబందం లేదన్నారు. 11 కోట్లు వసూలు చేసేందుకు సిద్దమయ్యారన్నారు. కీసరలో ఉన్న భూములను అమ్మేందుకు మరిన్ని అవకాశాలను వచ్చే విచారణలో తెలపాలని హైకోర్టు సి.ఐ.డి.కి. అదేశించింది.

Similar News